వరల్డ్ బ్యాంక్ రిపోర్ట్లో షాకింగ్ నిజాలు

వరల్డ్ బ్యాంక్ నిన్న రిలీజ్ చేసిన 'Poverty and Inequality Platform 2026' రిపోర్ట్లో భారత్కు సంబంధించి ఆసక్తికర విషయాలు తెలిపింది. అమెరికాలో పేదల్లో దిగువ 10% మంది రోజుకు 25 డాలర్లు సంపాదిస్తుండగా, భారత్లో వారి ఆదాయం కేవలం 3 డాలర్లే ఉంది. అంతేకాదు, ఇండియాలో ధనికుల్లో పై 10% మంది రోజువారీ ఆదాయం కూడా ఇతర దేశాల పేదల ఆదాయం కంటే తక్కువగా ఉందని రిపోర్ట్ తెలిపింది. దేశంలో ఆదాయం, ఉత్పాదకత పెంచడంపై ప్రభుత్వాలు దృష్టి పెట్టాలని ఆర్థికవేత్తలు సూచించారు.



