మంగళగిరిలో సరస్వతీ దేవి అలంకరణలో అమ్మవారు
గుంటూరు జిల్లా మంగళగిరి శ్రీ భద్రావతి సమేత భావన ఋషి స్వామివారి టెంపుల్లో దసరా శరన్నవరాత్రి సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి. మూలా నక్షత్రం సందర్భంగా అమ్మవారు సరస్వతీ దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా చాలామంది భక్తులు హాజరై తమ పిల్లలకు అక్షరాభ్యాసం చేయించారు. పూజా కార్యక్రమాల అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు.



