మట్టి వినాయకులే.. పర్యావరణ హితం!

పార్వతీపురం మన్యం జిల్లా సీతానగరం మండల కేంద్రంలో మట్టి వినాయక విగ్రహాల పంపిణీ జరిగింది. ఎమ్మెల్యే విజయచంద్ర ఆధ్వర్యంలో, ఎల్వీఎస్ సేవా సంస్థ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. పెద్ద మట్టి వినాయక విగ్రహాలను ప్రజలకు అందజేశారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా అందరూ మట్టి విగ్రహాలనే పూజించాలని ఎమ్మెల్యే కోరారు. ఈ సందర్భంగా నాయకులు, స్థానికులు పాల్గొన్నారు. మట్టి గణనాథుడే పర్యావరణ హితం.. మీ ఊరిలోనూ మట్టివినాయకుడినే పెడుతున్నారా? అయితే వాటి విశేషాలు వార్తగా పంపండి.



