ఎన్నికల నియమావళిపై అవగాహన

అల్లూరి సీతారామరాజు జిల్లా అరకులోయలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ, నియమావళిపై మండల పరిషత్ కార్యాలయంలో రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. సహాయ రిటర్నింగ్ అధికారి వీసం ప్రసాద్ ఎన్నికల షెడ్యూల్, అభ్యర్థులు చెల్లించాల్సిన డిపాజిట్లు, ఎన్నికల నిబంధనలను వివరించారు. రిటర్నింగ్ అధికారి మాదంశెట్టి శ్రీధర్ ఎన్నికల నియమావళిని ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించాలని సూచించారు. సమావేశంలో ఎస్ఐ మల్లేశ్వరరావు, తహశీల్దార్ రాజా శ్రీధర్, డిప్యూటీ ఎంపీడీఓ సత్యన్నారాయణ, నాయకులు పాల్గొన్నారు.



