తెలంగాణ యూనివర్సిటీలో భగత్ సింగ్ జయంతి వేడుకలు

తెలంగాణ యూనివర్సిటీ NSS విభాగాలు భగత్ సింగ్ జయంతిని నిర్వహించారు. NSS అధికారులు డాక్టర్ శ్రీనివాస్, డాక్టర్ స్వామిలతో పాటు టీచర్స్, స్టూడెంట్స్ భగత్ సింగ్ ఫోటోకి పూలమాలలు వేసి నివాళులర్పించారు. దేశం కోసం ఆయన చూపించిన ధైర్యం, దేశభక్తిని గుర్తుచేసుకుంటూ, ఆయన ఆలోచనలు నేటి యంగ్ జనరేషన్‌కి ఎంత అవసరమో చెప్పారు. స్టూడెంట్స్ అంతా ఈ ప్రోగ్రామ్‌లో చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు.



