← Back to news

అలుగు పోస్తున్న బయ్యారం చెరువు.. బారికేడ్లు ఏర్పాటు

By DK· 1d ago
అలుగు పోస్తున్న బయ్యారం చెరువు.. బారికేడ్లు ఏర్పాటు

TG: భారీ వర్షాలతో మహబూబాబాద్ జిల్లా బయ్యారం పెద్ద చెరువు నిండి అలుగు పోస్తుండటంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. గత రెండు రోజులుగా కురుస్తున్న ఎడతెరిపిలేని వర్షాలకు మసివాగు, పందిపంపుల వాగుల నుంచి భారీగా వరద నీరు చెరువులోకి చేరింది. దీంతో నీటిమట్టం 16.6 అడుగులకు చేరి అలుగు పోస్తోంది. ఈ దృశ్యాలను చూసేందుకు ప్రజలు తరలివస్తుండటంతో ప్రమాదాల నివారణకు ఎస్‌ఐ ప్రశాంత్‌బాబు ఆధ్వర్యంలో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. వాహనాలు చెరువు వైపు రాకుండా భారీ బారికేడ్లు ఏర్పాటు చేశారు.

More in Local