నేడు నానబియ్యం బతుకమ్మ

తెలంగాణలో బతుకమ్మ సంబరాలు కొనసాగుతున్నాయి. పండుగలో భాగంగా నాలుగో రోజున నానబియ్యం బతుకమ్మను మహిళలు భక్తిశ్రద్ధలతో జరుపుకుంటారు. ఆశ్వయుజ మాసంలోని పెద్ద తదియ రోజున నానబెట్టిన బియ్యాన్ని గౌరమ్మకు నైవేద్యంగా సమర్పిస్తారు. ఈ సందర్భంగా బతుకమ్మను రంగురంగుల పూలతో పేర్చి పూజలు చేస్తారు. నానబియ్యం నైవేద్యంగా సమర్పించే ఆచారం వల్ల ఈ రోజుకు నానబియ్యం బతుకమ్మ అనే పేరు వచ్చింది.



