ఎల్‌నినో ఎఫెక్ట్.. 4.5 లక్షల ప్రాణాలకు ముప్పు!

సూపర్ ఎల్‌నినో ప్రభావంతో వచ్చే ఆరు నెలలు ప్రపంచానికి తీవ్ర వేడి ముప్పు పొంచి ఉందని క్లైమేట్ ఇంపాక్ట్ ల్యాబ్ నివేదిక హెచ్చరించింది. 2026 సెప్టెంబర్ నుంచి 2027 ఫిబ్రవరి మధ్య సాధారణం కంటే అదనంగా 4.51 లక్షల మంది వేడి కారణంగా చనిపోయే అవకాశం ఉందని అంచనా వేసింది. భారత్‌లోనే 15,800 అదనపు మరణాలు జరగొచ్చని తెలిపింది. ఆఫ్రికా, ఆగ్నేయాసియా దేశాలపై ప్రభావం ఎక్కువగా ఉండొచ్చని పేర్కొంది.



