← Back to news

ఒక్క ఫేస్‌బుక్ కామెంట్.. యువకుడికి మరణశిక్ష

By Vishi· 7h ago· Tamilguardian
ఒక్క ఫేస్‌బుక్ కామెంట్.. యువకుడికి మరణశిక్ష

శ్రీలంకకు చెందిన 24 ఏళ్ల యువకుడు శివరాస అనోజన్‌కు సౌదీలో మరణశిక్ష విధించారు. 2025లో సౌదీ వెళ్లిన అతను ఫేస్‌బుక్‌లో జరిగిన ఒక ఆన్‌లైన్ చర్చలో మహమ్మద్ ప్రవక్తను తిడుతూ కామెంట్ రాశాడు. ఆపై కామెంట్‌ను వెంటనే తీసేసి, సారీ చెబుతూ వీడియో రిలీజ్ చేశాడు. ఆ స్క్రీన్‌షాట్‌లను కొందరు సౌదీ అధికారులకు పంపించారు. పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. కోర్టు అతనికి మరణశిక్ష విధించింది. శ్రీలంక స్పందించి, సౌదీ రాజుకు క్షమాభిక్ష విజ్ఞప్తి పంపనున్నట్లు ప్రకటించింది.

More in International