గూగుల్‌కు భారీ షాక్.. 4400 కోట్ల రూపాయల ఫైన్

యూజర్స్ లొకేషన్ డేటాను సరిగా నిర్వహించలేదన్న ఆరోపణలపై గూగుల్‌కు భారీ జరిమానా పడింది. ఐర్లాండ్ డేటా ప్రొటెక్షన్ కమిషన్ 408 మిలియన్ యూరోలు(4400 కోట్ల) ఫైన్ విధించింది. ‘వెబ్ అండ్ యాప్ యాక్టివిటీ’, ‘లొకేషన్ హిస్టరీ’, ఆండ్రాయిడ్‌లోని ‘లొకేషన్ అక్యూరసీ’ ఫీచర్లలో పర్సనల్ డేటాను,లీగల్ గా, ట్రాన్స్‌పరెంట్‌గా ప్రాసెస్ చేయలేదని దర్యాప్తులో తేలిందని తెలిపింది. ఈ కేసుపై దర్యాప్తు గతంలోనే ప్రారంభమైంది. గూగుల్ మాత్రం ప్రస్తుతం ఉన్న విధానాలు మారిపోయాయంది.



