← Back to news

ఎల్నినో ఎఫెక్ట్.. త్రాగునీటిపై కలెక్టర్ సమీక్ష!

By K Yakaiah Yadav· 3h ago· Mahabubabad (Ct), Mahabubabad, Mahabubabad
ఎల్నినో ఎఫెక్ట్.. త్రాగునీటిపై కలెక్టర్ సమీక్ష!

జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ బుధవారం కలెక్టరేట్‌లో అధికారులతో సమీక్ష నిర్వహించారు. మిషన్ భగీరథ, ఇంట్రా, గ్రిడ్, స్థానిక సంస్థల అధికారులతో మాట్లాడారు. ప్రతి ఒక్కరికి స్వచ్ఛమైన త్రాగునీరు అందాలన్నారు. ఎల్నినో ప్రభావంతో సాగునీరు, త్రాగునీటి సమస్యలు రావచ్చని, ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు. OHR (1477), ఇతర వనరుల ద్వారా నీటి సరఫరా చేయాలని ఆదేశించారు. నీరు అందని గ్రామాలు, పట్టణాల వివరాలు వెంటనే ఇవ్వాలన్నారు.

More in Local