చిట్టీల పేరుతో టీచర్ మోసం

సూర్యాపేట జిల్లాలో చిట్టీల పేరుతో ఒక గవర్నమెంట్ టీచర్ దాదాపు 10 కోట్ల రూపాయలు తీసుకుని పారిపోయిన సంఘటన జరిగింది. ఆత్మకూర్ శెట్టిగూడెం స్కూల్లో టీచర్‌గా పనిచేస్తున్న రాజు, 12 గ్రామాల ప్రజల నుంచి భారీగా డబ్బులు వసూలు చేశాడు. ఆ తర్వాత తన ఆస్తులను వేరేవాళ్ల పేరిట మార్చేసి, ఇంటికి తాళం వేసి కుటుంబంతో సహా పారిపోయాడు. మోసపోయామని తెలుసుకున్న ప్రజలు కంప్లైంట్ చేయడంతో పోలీసులు ఎంక్వైరీ ప్రారంభించారు.



