పిడుగుపాటు.. మహిళ మృతి!

పిడుగుపాటు మరో ప్రాణం తీసింది. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మండలం ఎక్కవాయిపల్లి గ్రామానికి చెందిన ఎడ్ల యాదమ్మ (54). బుధవారం కూలి పనికి వెళ్లి తిరిగి వస్తుండగా పిడుగు పడింది. అక్కడికక్కడే మృతి. మృతురాలికి ముగ్గురు పిల్లలు. గ్రామంలో విషాదం నెలకొంది.


