← Back to news

6 నెలల్లో 80 మంది చిన్నారులు మృతి

By Sharmila· 9h ago· Indianexpress
6 నెలల్లో 80 మంది చిన్నారులు మృతి

మధ్యప్రదేశ్‌‌లో 6 నెలల్లో 80 మంది పిల్లలు చనిపోవడం తీవ్ర కలకలం రేపుతోంది. సియోని జిల్లా.. ఇందిరా గాంధీ డిస్ట్రిక్ట్ హాస్పిటల్‌‌‌లో వరుస మరణాలు నమోదవుతున్నాయి. ఇది ప్రభుత్వ నిర్లక్ష్యమే అనే విమర్శలు వస్తుండగా.. ప్రభుత్వం మాత్రం హాస్పిటల్‌ని తప్పుపడుతోంది. నైట్ షిఫ్ట్‌లో డాక్టర్స్ అందుబాటులో లేకపోవడం వల్లే చనిపోతున్నారని BJP MLA దినేశ్ రాయ్ మున్మున్ ఆరోపించారు. నెలలు నిండక ముందే పుట్టడం, తక్కువ బరువు, అనారోగ్యాలే మరణాలకు కారణమని అధికారులంటున్నారు.

More in National