పవన్.. ఆ భూమిని ప్రభుత్వానికి అప్పగించు: కవిత

TG: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఎదుర్కొంటున్న కోడి చెరువు కబ్జా ఆరోపణలపై TRS పార్టీ స్టేట్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల కవిత స్పందించారు. శనివారం జూబ్లీహిల్స్‌లోని టీఆర్ఎస్ పార్టీ ఆఫీస్‌లో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. కోడిచెరువు శిఖంభూమి అని ఇరిగేషన్ రికార్డులు స్పష్టంగా చెబుతున్నాయని అందువల్ల పవన్ కల్యాణ్ ఆ భూమిని ప్రభుత్వానికి అప్పగించాలన్నారు. అలాగే అక్కడ వేసిన కంచెను, మట్టిని తక్షణమే తొలగించాలని కవిత డిమాండ్ చేశారు.


