అటవీ శాఖ అధికారుల నిమ్మకు నీరెత్తిన తీరు
నిర్మల్ జిల్లా నర్సాపూర్ (జి) మండల కేంద్రం నుండి డొంగూర్ గాం, లోకేశ్వరం మీదుగా నిజామాబాద్ జిల్లాకు ఎటువంటి అనుమతులు లేకుండా అడవి పందుల అక్రమ రవాణా యథేచ్ఛగా సాగుతోంది. వన్యప్రాణుల రక్షణ చట్టాలకు విరుద్ధంగా జరుగుతున్న ఈ తంతుపై స్థానికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అటవీ మరియు పోలీసు శాఖ అధికారులు స్పందించి తక్షణ చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.



