← Back to news

లక్ష్మాపురంలో పనిచేయని CC కెమెరాలు

By Madhu Krishna KR· 1d ago
లక్ష్మాపురంలో పనిచేయని CC కెమెరాలు

మేడ్చల్ జిల్లా మూడుచింతలపల్లి మున్సిపాలిటీ లక్ష్మాపురంలో గ్రామ భద్రతపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతంలో దాత, యువ నాయకుడు క్యాతం మధుకృష్ణ గ్రామ భద్రత కోసం ఏర్పాటు చేయించిన CCTV కెమెరాల్లో ప్రస్తుతం ఒక్కటీ పనిచేయడం లేదని గ్రామస్థులు తెలిపారు. కౌన్సిలర్లు ఎన్నికై ఆరు నెలలు పూర్తయినా కెమెరాల పునరుద్ధరణపై తగిన చర్యలు తీసుకోలేదని పేర్కొన్నారు. మున్సిపల్ చైర్మన్, అధికారులు, కౌన్సిలర్లు వెంటనే CCTV కెమెరాలను రిపేర్ చేయాలని కోరుతున్నారు.

More in Local