గుడిలోకి వెళ్లిన ఎస్సీ యువకుడిపై వివక్ష
TG : వనపర్తి జిల్లా మంగంపల్లిలో ఒక ఎస్సీ యువకుడిని "మేం కట్టుకున్న గుడిలోకి నువ్వెట్లా వస్తావ్?" అని కాంగ్రెస్ ఎమ్మెల్యే మేఘారెడ్డి మేనమామ అడ్డుకోవడాన్ని RS ప్రవీణ్ కుమార్ తన 'X' అకౌంట్లో పోస్ట్ చేశారు. ఈ గుడి గ్రామ పంచాయతీ భూమిలో కట్టిందని, కాబట్టి గుడిలోకి వెళ్లడం నేరం కాదని ప్రవీణ్ కుమార్ తెలిపారు. ఎమ్మెల్యే స్వయంగా వెళ్లి తన మేనమామపై కేసు పెట్టి అరెస్ట్ చేయించాలని ఆయన డిమాండ్ చేశారు.



