← Back to news

బాలానగర్‌లో ఘోర ప్రమాదం

By A.Ajay· 2h ago

TG: హైదరాబాద్ నగరం బాలానగర్‌లో ఐరన్‌ పైపుల లోడ్‌తో వెళ్తున్న ఆటో అదుపుతప్పి బోల్తా పడింది. అదే టైంలో పక్కనే వెళ్తున్న స్కూటీదారుడు ప్రమాదానికి గురయ్యాడు. ఈ ఘటనలో స్కూటీ నడుపుతున్న వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రమాద దృశ్యాలు సమీపంలోని సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి. పైపుల లోడ్‌ కారణంగానే ఆటో అదుపు తప్పిందా అనే విషయంపై పోలీసులు విచారణ చేస్తున్నారు.

More in TG