మంచిరేవుల ఆలయంపై సర్కార్ బిగ్ ప్లాన్.. రూ.1,108 కోట్లు!

TG: మూసీ నది ఒడ్డున గండిపేట మంచిరేవులలో శ్రీ ఓంకారేశ్వర స్వామి ఆలయ కాంప్లెక్స్ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం 1,108.27 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసింది. ఇందులో టెంపుల్ డెవలప్‌మెంట్‌కు 948.65 కోట్లు, 2.5 కిలోమీటర్లతో 100 అడుగుల వెడల్పుతో 6-లేన్ రోడ్డుకు 159.62 కోట్లు అలాట్ చేశారు. ఆలయంలో ప్రధాన ఆలయంతో పాటు 5 ఉపాలయాలు, మహా మండపం, నంది మండపం, రాజగోపురాలు, పుష్కరిణి, యాగశాల, భారీ శివుడి విగ్రహం ఏర్పాటు చేయనున్నారు.


