హమాలీల సేవలకు గుర్తింపు

హమాలీల సేవలను గుర్తిస్తూ మంచిర్యాల జిల్లాలో వారికి దసరా పండుగ కానుకలు అందించారు. జిల్లాలోని MLS పాయింట్లలో పనిచేస్తున్న హమాలీలకు జిల్లా అదనపు కలెక్టర్ వి. రాములు దసరా బోనస్తో పాటు రెండు జతల యూనిఫాంలను పంపిణీ చేశారు. హమాలీల సంక్షేమానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. పౌరసరఫరాల శాఖకు సేవలందిస్తున్న హమాలీల కృషిని గుర్తించి ఈ కార్యక్రమం చేపట్టినట్లు చెప్పారు. జిల్లా పౌరసరఫరాల శాఖ మేనేజర్ శ్రీకళతో పాటు సంబంధిత అధికారులు పాల్గొన్నారు.



