కుట్టి వెల్లోడి ఆసుపత్రి పనుల పరిశీలన

సికింద్రాబాద్ సీతాఫల్‌మండిలోని కుట్టి వెల్లోడి ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణ పనులను మంగళవారం ఎమ్మెల్యే టి. పద్మారావు పరిశీలించారు. రూ.11.30 కోట్ల వ్యయంతో ఈ ఆసుపత్రి నిర్మిస్తున్నారు. నిర్మాణ పనులపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు. పేదలకు అందుబాటులో ఉండేలా ఆధునిక సదుపాయాలతో మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిగా తీర్చిదిద్దాలని సూచించారు. నాణ్యత, మన్నిక ఉండేలా నిర్మాణాలు జరగాలని, వైద్యరంగ మార్పులకు అనుగుణంగా ఉండాలని తెలిపారు.


