← Back to news

మిడ్ మానేరుకు భారీగా వరద ప్రవాహం

By Bala· 3h ago
మిడ్ మానేరుకు భారీగా వరద ప్రవాహం

సిరిసిల్ల జిల్లా బోయిన్పల్లి మండలం మాన్వాడ మిడ్ మానేరు రిజర్వాయర్కు 12,600 క్యూసెక్కుల భారీ వరద ప్రవాహం వచ్చి చేరుతోంది. సోమవారం ఉదయం 6 గంటలకు నీటిమట్టం 316.49 మీటర్లకు, నీటి నిల్వ 23.791 టీఎంసీలకు చేరింది. 14,230 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఐదు స్పిల్వే గేట్లను ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. జూన్ 1 నుంచి ఇప్పటివరకు 25.738 టీఎంసీల నీరు ఉంది.

More in Local