అణగారిన వర్గాలకు రిజర్వ్‌డ్ సీట్లు.. పూణే పాక్ట్

ఒకవైపు గాంధీ నిరాహార దీక్ష.. మరోవైపు అంబేద్కర్ డిమాండ్లు.. చివరికి చర్చలతో 1932 సెప్టెంబర్ 24న ‘పూణే పాక్ట్’ కుదిరింది. ఎస్సీ వర్గాలకు ప్రత్యేకంగా ఓటు వేసే అవకాశం(Separate Electorate) ఇవ్వాలని బ్రిటిష్ ప్రభుత్వం నిర్ణయించింది. గాంధీ దీన్ని ఒప్పుకోలేదు. ఆ తర్వాత జరిగిన చర్చల్లో ప్రత్యేక ఓటింగ్‌కు బదులుగా అసెంబ్లీల్లో కొన్ని సీట్లు రిజర్వ్ చేయాలని నిర్ణయించారు. అణగారిన వర్గాల వాటాకు ఇది కీలక మలుపు. రెండు రోజుల తర్వాత గాంధీ తన దీక్షను ఆపేశారు.


