పక్షులు కనిపించకపోతే.. ప్రకృతికే ప్రమాదమా?

పక్షుల సంఖ్య తగ్గిపోవడం ప్రకృతి వినాశనానికి పెద్ద హెచ్చరిక అని ప్రముఖ పక్షి శాస్త్రవేత్త అసద్ రహ్మానీ తన కొత్త పుస్తకం ‘Where Have the Birds Gone’లో వివరించారు. భారత్‌లో స్కైలార్క్‌ల సంఖ్య దాదాపు 80 శాతం తగ్గగా, 12 ఏళ్లలో ఇండియన్ రోలర్ల సంఖ్య 30 శాతం తగ్గిందన్నారు. ప్రపంచవ్యాప్తంగా సుమారు 1,256 పక్షి జాతులు అంతరించే ప్రమాదంలో ఉన్నాయని తెలిపారు. అడవులు తగ్గడం, కరెంట్ తీగలు, పురుగుమందులు, వేట, వీధికుక్కల వల్ల పక్షులకు ముప్పు పెరుగుతోందన్నారు.


