విద్యుత్ అధికారుల తీరుపై సర్పంచుల గుస్సా..

ఖమ్మంజిల్లాలోని వేంసూరు మండల పరిషత్ కార్యాలయంలో బుధవారం విద్యుత్ అధికారులు, సర్పంచుల ఉమ్మడి సమావేశం జరిగింది. ఎంపీడీఓ కావ్య ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశం రసాబసాగా మారింది. లింగపాలెం, కందుకూరు, భీమవరం సర్పంచులు విద్యుత్ సరఫరాలో లోపాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పలుమార్లు తెలిపినా అధికారులు సవరించడం లేదన్నారు. మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య ధర్నా చేసి వారం రోజులు గడిచినా పట్టించుకోలేదని మండిపడ్డారు. సీఎండీకి ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు.



