పాకిస్థాన్‌లో బాంబు దాడి.. 11 మంది మృతి

పాకిస్థాన్‌లోని ఖైబర్ పఖ్తుంఖ్వాలో పోలీస్ చెక్‌పోస్ట్‌పై ఆత్మాహుతి బాంబు దాడి జరిగింది. ఈ ఘటనలో 11 మంది మృతి చెందగా, మరో 30 మంది గాయపడ్డారు. పేలుడులో పలువురు పోలీసులు, సాధారణ ప్రజలు గాయపడ్డారు. సమాచారం అందుకున్న భద్రతా బలగాలు అక్కడికి చేరుకుని గాయపడినవారిని ఆసుపత్రికి తరలించాయి. ఆ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకుని నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టాయి.


