← Back to news

'సమ్మెను విజయవంతం చేయాలి'

By Bala· 7h ago
'సమ్మెను విజయవంతం చేయాలి'

ఆసిఫాబాద్ జిల్లాలో బ్యాంకు ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం చేపట్టనున్న దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేయాలని సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి జోగే ఉపేందర్ కోరారు. ఆదివారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. బ్యాంకుల్లో పెరుగుతున్న పనిభారం, పని లక్ష్యాల ఒత్తిడితో ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. వారానికి ఐదు రోజుల పనిదినాలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా అధ్యక్షుడు, తదితరులు పాల్గొన్నారు.

More in Local