← Back to news

ఇరాన్‌పై చైనాకు నిజంగానే అంత పట్టు ఉందా?

By Nani· 30 Jul 2026· Reuters
ఇరాన్‌పై చైనాకు నిజంగానే అంత పట్టు ఉందా?

చైనా ఒక్క మాట చెబితే ఇరాన్ ఆగిపోతుందా..? ఇదే ఇప్పుడు గల్ఫ్ దేశాల ఆశ. ఇరాన్‌తో యుద్ధం మళ్లీ తీవ్రం కావడంతో, గల్ఫ్ దేశాలు ఇప్పుడు అమెరికా కంటే చైనా వైపు చూస్తున్నాయి. హోర్ముజ్ జలసంధి, ఎర్ర సముద్రంలో రాకపోకలు సజావుగా కొనసాగేలా ఇరాన్‌పై తన ఆర్థిక ప్రభావాన్ని ఉపయోగించాలని చైనాను కోరుతున్నాయి. అయితే చైనా మాత్రం యుద్ధంలో ఏ పక్షం వైపు నిలవకుండా, చర్చల ద్వారానే సమస్య పరిష్కారం కావాలని చెబుతోంది. దీంతో ఇరాన్‌పై చైనాకు నిజంగా ఎంత ప్రభావం ఉందనే విషయం ఇప్పుడు పరీక్షగా మారింది.

More in Politics