నిమజ్జనం ఎఫెక్ట్.. వైన్ షాపులకు తాళాలు!

గణేష్ నిమజ్జనం సందర్భంగా సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో మద్యం షాపులు బంద్ కానున్నాయి. శాంతిభద్రతల పరిరక్షణ కోసం సెప్టెంబర్ 25 ఉదయం 6 గంటల నుంచి సెప్టెంబర్ 26 ఉదయం 6 గంటల వరకు వైన్ షాపులు, కల్లు దుకాణాలు, రెస్టారెంట్ బార్లను మూసివేయాలని సైబరాబాద్ CP ఎం. రమేష్ ఆదేశాలు జారీ చేశారు. మద్యం మత్తులో ఎలాంటి గొడవలు జరగకుండా నిఘా ఏర్పాటు చేశారు. అయితే స్టార్ హోటళ్లు, రిజిస్టర్డ్ క్లబ్బులకు ఈ రూల్ నుంచి మినహాయింపు ఇచ్చారు.
