← Back to news

చీపురుపల్లిలో బ్లడ్ స్టోరేజ్ సెంటర్

By DK· 15 Aug 2026· విజయనగరం
చీపురుపల్లిలో బ్లడ్ స్టోరేజ్ సెంటర్

AP: విజయనగరం జిల్లా చీపురుపల్లి మండల ప్రాంత ప్రజలకు అత్యవసర సమయాల్లో రక్తం అందుబాటులో ఉండేలా ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో బ్లడ్ స్టోరేజ్ సెంటర్‌ను ఏర్పాటు చేశారు. MLA కిమిడి కళా వెంకటరావు, MP కలిశెట్టి అప్పలనాయుడు కలిసి కేంద్రాన్ని ప్రారంభించారు. ప్రమాదాలు, అత్యవసర శస్త్రచికిత్సలు, ప్రసవ సమయాల్లో రక్తం అవసరమైన వారికి ఈ కేంద్రం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని నాయకులు తెలిపారు. అత్యవసర సమయంలో రక్తం కోసం దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన ఇబ్బందులు తగ్గనున్నాయని పేర్కొన్నారు.

More in Local