← Back to news

జిల్లా స్థాయి సైన్స్ పోటీల్లో సందడి

By Bala· 4h ago
జిల్లా స్థాయి సైన్స్ పోటీల్లో సందడి

చిత్తూరు జిల్లాలో జనవిజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో ఆదివారం జిల్లా స్థాయి చెకుముకి సైన్స్ సంబరాలు నిర్వహించారు. జిల్లాలోని 28 మండలాల నుంచి 40 విద్యార్థుల బృందాలు పోటీల్లో పాల్గొన్నాయి. ఈ సందర్భంగా స్క్రీనింగ్ టెస్ట్, క్విజ్ నిర్వహించి ప్రతిభ కనబరిచిన విద్యార్థులను ఎంపిక చేశారు. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల నుంచి ఎంపికైన రెండు బృందాలు భీమవరంలో జరగనున్న రాష్ట్రస్థాయి పోటీల్లో జిల్లా తరఫున పాల్గొంటాయని నిర్వాహకులు తెలిపారు.

More in Local