← Back to news

టీచర్లు సెలవులో.. పిల్లలు డ్యూటీలో

By BK· 12h ago· కొమరంభీం ఆసిఫాబాద్
టీచర్లు సెలవులో.. పిల్లలు డ్యూటీలో

TG : చింతలమానెపల్లి మండలం కొత్తగూడ గవర్నమెంట్ స్కూల్‌లో ఉన్న ఇద్దరు టీచర్లలో ఒకరు డిప్యుటేషన్‌పై వెళ్తే, ఇంకొకరు సెలవులో వెళ్లారు. టీచర్లు ఎవరూ రాకపోవడంతో.. రోజూ లాగే వచ్చిన పిల్లలే తాళాలు తీసి లోపలికి వెళ్లారు. కొంతసేపు ఉండి, మధ్యాహ్నం మళ్లీ తాళం వేసి ఇళ్లకు వెళ్ళిపోయారు. తమ పిల్లల చదువు పాడవుతోందని తల్లిదండ్రులు మండిపడుతున్నారు. ఈ విషయంపై MEO జయరాజ్ స్పందించి, విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని చెప్పారు.

More in TG