2,700కే వచ్చే క్యాన్సర్ మందు.. 27,000కు అమ్ముతారా?

క్యాన్సర్ మందుల ధరల్లో భారీ తేడాపై సుప్రీంకోర్టు తీవ్రంగా రియాక్ట్ అయ్యింది. రిటైలర్‌కు 2,700 రూపాయలకే అందే క్యాన్సర్ మందుపై 27,000 రూపాయల MRP ఉండటాన్ని ప్రశ్నించింది. రోగులు చికిత్స కోసం ఇళ్లు, బంగారం అమ్ముకునే పరిస్థితి ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. ధరలను నియంత్రించాల్సిన అధికారులు ఎందుకు స్పందించడం లేదని నిలదీసింది. అన్ని మందుల ధరలపై నియంత్రణ అవసరమా అనే అంశంపై కూడా కోర్టు చర్చించింది. తర్వాతి విచారణ సెప్టెంబర్ 29న జరగనుంది.


