CMRF చెక్కులు.. పేదలకు భరోసా!ల

కాకినాడ జిల్లా ప్రత్తిపాడులో టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ రాజా చేతుల మీదుగా రూ.8.10 లక్షల CMRF చెక్కులు పంపిణీ అయ్యాయి. ప్రత్తిపాడు, ఏలేశ్వరం మండలాల పేద కుటుంబాలకు ఇవి అందాయి. అనారోగ్యంతో చికిత్స పొందుతున్న వాళ్లకు ఈ సాయం భరోసా. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. CMRF పేదలకు ఆర్థిక భారం తగ్గిస్తుందన్నారు. కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, గ్రామస్థులు పాల్గొన్నారు.


