భారీ వర్షం.. పొంగి పొర్లుతున్న వాగులు

తుఫాను ప్రభావంతో పోలవరం జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో నీటిమట్టాలు పెరిగి నదులు, కొండవాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. పోలవరం జిల్లా చింతూరు డివిజన్ వి.ఆర్.పురం మండలంలో అన్నవరం వాగు పొంగి వరదనీరు రహదారిపై నుంచి ప్రవహిస్తోంది. దీంతో చింతూరు, వి.ఆర్.పురం మండలాల మధ్య బుధవారం ఉదయం నుంచి రాకపోకలు నిలిచిపోయాయి. వి.ఆర్.పురం మండలంలోని సుమారు 20 గ్రామాలకు కూడా రాకపోకలు స్తంభించాయి. భారీ వర్షాలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.


