ఎల్నినో ఎఫెక్ట్.. హైదరాబాద్‌లో ఎండల సెగ!

TG: ఎల్నినో ప్రభావంతో గ్రేటర్ హైదరాబాద్‌లో వానలు తగ్గిపోయాయి. అక్టోబర్ 11 నాటికి హైదరాబాద్‌లో 33%, మేడ్చల్-మల్కాజిగిరిలో 37%, రంగారెడ్డి జిల్లాలో 22% తక్కువ వర్షపాతం నమోదైంది. మరోవైపు ఎండలు మండిపోతున్నాయి. మూడు రోజులుగా మధ్యాహ్నం ఉష్ణోగ్రతలు 35 డిగ్రీలుగా నమోదవుతున్నాయి. రాత్రిపూట కూడా ఉక్కపోతతో జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. వానలు లేక, వేడి పెరగడంతో నగరవాసులు అల్లాడుతున్నారు. బయటకు వెళ్లాలంటేనే ఎండ భయపెడుతోంది.


