← Back to news

దుర్గగుడి ఘాట్‌రోడ్‌లో విరిగిపడిన కొండచరియలు

By Mahesh· 2h ago· విజయవాడ

AP: విజయవాడ దుర్గగుడి ఘాట్‌రోడ్‌లో కొండచరియలు విరిగిపడటం కలకలం రేపింది. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా ఈ ఘటన జరిగింది. దసరా నవరాత్రి ఉత్సవాలకు ఏర్పాట్లు కోసం అధికారులు రెండు రోజుల ముందే ఘాట్‌రోడ్‌ను క్లోజ్ చేయడంతో ప్రమాదం తప్పింది. ఘటనపై మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఆరా తీసి, సేఫ్టీ మెజర్స్ పక్కాగా చేపట్టాలని ఆదేశించారు. కొండ పరిస్థితిని స్టడీ చేసేందుకు బెంగళూరులోని NIRM ఎక్స్‌పర్ట్ టీమ్‌ను రప్పించి పరిశీలించాలని సూచించారు.

More in AP