గణేష్ నిమజ్జనం.. ఎస్పీ ఫుల్ సెక్యూరిటీ!

యాదాద్రి భువనగిరి జిల్లా ఎస్పీ అక్షాన్ష్ యాదవ్ గణేష్ నిమజ్జనాలకు పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు. ఆలేరు, యాదగిరిగుట్ట, రాయగిరి, బీబీనగర్, భువనగిరిలో ఏర్పాట్లను స్వయంగా పరిశీలించారు. బారికేడింగ్, లైటింగ్, భద్రతపై అధికారులకు సూచనలు చేశారు. శోభాయాత్రలు ప్రశాంతంగా జరగాలని, ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు. డీఎస్పీలు శ్రీనివాస్ నాయుడు, రవీందర్, ప్రభాకర్ రెడ్డి, సీఐలు, ఎస్సైలు పాల్గొన్నారు.



