హామీలు నెరవేర్చే వరకు పోరాటం: CPM

నంద్యాల బొగ్గులైన్‌లో నివసిస్తున్న ప్రతి కుటుంబానికి రెండు సెంట్ల స్థలం కేటాయించి, ఇళ్లు నిర్మించి మౌలిక వసతులు కల్పించాలని డిమాండ్ చేస్తూ CPM ఆధ్వర్యంలో భారీ ర్యాలీ, ధర్నా నిర్వహించారు. అనంతరం తహసీల్దార్ శ్రీనివాసులుకు వినతిపత్రం అందజేశారు. స్థానిక ఎన్నికల నేపథ్యంలో కొందరికే ఇంటి పట్టాలు ఇచ్చి నిజమైన లబ్ధిదారులకు అన్యాయం చేస్తున్నారని నాయకులు ఆరోపించారు.



