రూ.25 వేల బిల్లు కోసం ఆక్సిజన్ ఆపేశారు

హైదరాబాద్‌లోని సైదాబాద్ సాయినర్సింగ్ హోమ్‌లో చికిత్స పొందుతున్న ఓ పేషంట్‌కి ఆక్సిజన్ సరఫరా నిలిపివేశారంటూ కుటుంబసభ్యులు ఆందోళనకు దిగారు. రెండు రోజులుగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రోగిని మెరుగైన వైద్యం కోసం పెద్ద ఆస్పత్రికి తరలించాలని వైద్యులు సూచించినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. పేషంట్‌ను తరలించేందుకు రూ.75 వేల బిల్లు చెల్లించాలని కోరగా, ఇప్పటికే రూ.50 వేలు అడ్వాన్స్‌గా చెల్లించామని, మిగిలిన రూ.25 వేలపై చర్చ జరుగుతుండగానే ఆక్సిజన్ నిలిపివేశారని ఆరోపించారు.