← Back to news

రైతు కుటుంబానికి 50లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలి: MP

By DK· 1d ago· మెదక్ జిల్లా
రైతు కుటుంబానికి 50లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలి: MP

పంట ఎండిపోవడంతో రైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన మెదక్ జిల్లా శివ్వంపేట మండలం శంకర్ తండాలో విషాదం నింపింది. వరికి సరిపడా నీరు అందకపోవడంతో మనస్తాపానికి గురైన మాలోత్ శంకర్ పొలంలోని చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడి కుటుంబాన్ని మెదక్ MP మాధవనేని రఘునందన్ రావు పరామర్శించారు. రైతు కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం ₹.50 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలని, కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని డిమాండ్ చేశారు.

More in Local