← Back to news

టిప్పర్ను ఢీకొట్టిన కారు.. డ్రైవర్ మృతి!

By Jagadish· 1d ago
టిప్పర్ను ఢీకొట్టిన కారు.. డ్రైవర్ మృతి!

మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో ఆదివారం ఘటన జరిగింది. శామీర్‌పేట నుంచి కీసర ఔటర్ రింగ్ మార్గంలో యాద్గార్‌పల్లి వద్ద ఫోర్ రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. శామీర్‌పేట నుంచి కీసర వైపు వెళ్తున్న టిప్పర్‌ను వెనుక నుంచి కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రమాద తీవ్రతకు కారు ముందు భాగం పూర్తిగా ధ్వంసమైంది. మృతుడి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

More in Local