← Back to news

దళిత సర్పంచ్‌కు వేధింపులు.. చర్యలకు KVPS డిమాండ్

By Kamal Kumar· 2h ago· Yenkapalle, Yelal, Vikarabad
దళిత సర్పంచ్‌కు వేధింపులు.. చర్యలకు KVPS డిమాండ్

వికారాబాద్ జిల్లా యాలాల మండలం ఎనికెపల్లి గ్రామ దళిత మహిళా సర్పంచ్ స్వరూపను వేధింపులకు గురిచేస్తున్నారు. పంచాయతీ నిధులను అక్రమంగా విత్‌డ్రా చేసినట్లు కార్యదర్శి శేఖర్‌పై ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో కార్యదర్శిని వెంటనే సస్పెండ్ చేయాలని కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఉప్పలి మల్కయ్య డిమాండ్ చేశారు. దళిత మహిళా ప్రజాప్రతినిధిపై వేధింపులు, నిధుల దుర్వినియోగంపై ఉన్నతాధికారులు సమగ్ర విచారణ చేపట్టాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.

More in Local