ఇటలీ గురుద్వారా బయట కాల్పులు.. ఇద్దరు ఇండియన్స్ దుర్మరణం

ఇటలీలో దారుణం జరిగింది. బెర్గామో ప్రావిన్స్లోని ఒక గురుద్వారా బయట ఇద్దరు భారతీయులను గుర్తుతెలియని వ్యక్తులు కాల్చి చంపారు. పంజాబ్కు చెందిన వీరిద్దరూ అక్కడ పని చేసుకుంటుండగా ఈ దాడి జరిగింది. ప్రశాంతంగా ఉండే ఆ ప్రాంతంలో ఇలాంటి క్రైమ్ జరగడం అక్కడి ఇండియన్ కమ్యూనిటీని భయాందోళనకు గురిచేస్తోంది. అసలు ఏం జరిగిందనే కోణంలో ఇటలీ పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు.
