నేరస్తులను వీధుల్లోకి వదులుతున్న BJP: ప్రకాశ్రాజ్
CJP నేతలు సౌరవ్ దాస్, అశుతోష్ రంకాలను ఐదు రోజుల జ్యుడీషియల్ కస్టడీకి తరలించడాన్ని నటుడు, సామాజిక కార్యకర్త ప్రకాశ్ రాజ్ తీవ్రంగా ఖండించారు. ఢిల్లీలో జాతీయ జెండాను ప్రదర్శించినంత మాత్రాన వాళ్లను అర్ధరాత్రి 3 గంటలకు మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచి, కస్టడీకి పంపడం సరికాదన్నారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించని వారిని అణగదొక్కి, నేరస్థులను మాత్రం వీధుల్లోకి వదిలేస్తున్నారని విమర్శించారు. ఈ అన్యాయాన్ని, పక్షపాత వైఖరిని ఆయన తీవ్రంగా తప్పుబట్టారు.

