'గుమస్తాలకు సీఐటీయూ అండ'

ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలో గుమస్తాల సంఘం ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం జిల్లా సహాయ కార్యదర్శి మల్లూరు చంద్రశేఖర్ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన లేబర్ కోడ్లతో గుమస్తాలకు నష్టం జరుగుతోందని ఆరోపించారు. రోజుకు 8 గంటల పని 12 గంటలకు పెరిగినా అందుకు తగిన వేతనం అందడం లేదన్నారు. గుమస్తాల సమస్యలపై CITU అండగా ఉంటుందని నేత కొలికపోగు సర్వేశ్వరరావు హామీ ఇచ్చారు.


