మంగళగిరి నుంచి తెనాలికి ఆర్యవైశ్యుల ర్యాలీ
గుంటూరు జిల్లా ఆర్యవైశ్య సంఘం ప్రమాణ స్వీకార కార్యక్రమానికి మంగళగిరి నాయకులు, సభ్యులు ఇవాళ తెనాలికి భారీ ర్యాలీగా బయలుదేరారు. పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు నేరెళ్ల మురళీమోహన్ కృష్ణ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. జిల్లా కమిటీలో మంగళగిరికి ఏకంగా 20 పదవులు రావడంతో సభ్యులంతా తెనాలి బయలుదేరారు. యువజన సంఘం జనరల్ సెక్రటరీ మద్ది నిఖిల్‌తో పాటు పలువురు నాయకులు ఈ ర్యాలీలో పాల్గొన్నారు.



