← Back to news

పోలీసులు రైడ్స్ చేసినా ఆగని దందా!

By BK· 1d ago· శ్రీకాకుళం
పోలీసులు రైడ్స్ చేసినా ఆగని దందా!

శ్రీకాకుళం జిల్లా బోర్డర్ ఏరియాల్లో నాటుసారా తయారుచేస్తూ అక్రమంగా తరలిస్తున్నారు. ఒడిశా సరిహద్దు గ్రామాలు సహా మందస, టెక్కలి, ఇచ్ఛాపురం, సీతంపేట లాంటి మండలాల్లో ఈ దందా ఎక్కువగా సాగుతోంది. పోలీసులు దాడులు చేసి కేసులు పెడుతున్నా వ్యాపారులు అస్సలు తగ్గకుండా లక్షలు సంపాదిస్తున్నారు. మరోవైపు ఈ సారాకి అలవాటు పడి చాలామంది హెల్త్ పాడుచేసుకుని హాస్పిటల్స్ పాలవుతున్నారు. ఎప్పటికైనా చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

More in Local