← Back to news

ఇసుక ట్రాక్టర్ పట్టివేత.. డ్రైవర్ అరెస్ట్

By Kamal Kumar· 1d ago· Allapur (Basheerabad), Basheerabad, Vikarabad
ఇసుక ట్రాక్టర్ పట్టివేత.. డ్రైవర్ అరెస్ట్

వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలంలో అనుమతులు లేకుండా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్‌ను పోలీసులు పట్టుకున్నారు. వీర్‌సెట్టిపల్లి వాగు నుంచి గొట్టిగ ఖుర్దు గ్రామానికి ఇసుక తరలిస్తుండగా గొట్టిగ ఖుర్దు గేట్ వద్ద ట్రాక్టర్‌ను స్వాధీనం చేసుకున్నారు. డ్రైవర్ నర్సింహులును అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. అతను తాండూర్ మండలం గోనూర్ గ్రామానికి చెందిన వ్యక్తిగా పేర్కొన్నారు. ట్రాక్టర్‌ను బషీరాబాద్ PSకు తరలించినట్లు ఎస్సై విఠల్ తెలిపారు.

More in Local